గురువులే సమాజ నిర్మాణశిల్పులు | - | Sakshi
Sakshi News home page

గురువులే సమాజ నిర్మాణశిల్పులు

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలి: కడియం శ్రీహరి

25 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

జనగామ: గురువులే సమాజ భవిష్యత్తును నిర్మించే శిల్పులని, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురుపూజోత్స వం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదా నోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కడియం శ్రీహరితో పాటు కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారి సందీప్‌ కుమార్‌ ఝా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, స్టేషన్‌ఘనపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మారుజోడు రాంబాబు తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగల గొప్పశక్తి ఉపాధ్యాయుడికి ఉందని కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారి సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మిషన్‌ శిఖరం కింద తెలంగాణలో జిల్లా మొదటి స్థానంలో నిలవడం, పర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో 600కు 383 మార్కులు సాధించడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని కలెక్టర్‌ అభినందించారు. జీసీడీఓ గౌసియా బేగం, సీఎంఓ నాగరాజు, ఏఎస్సీ శ్రీకాంత్‌రెడ్డి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో విశిష్ట సేవలు అందించిన 25 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు.

సన్మానగ్రహీతలు వీరే..

ఎం.శోభారాణి, జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌ మీడికొండ, ఎన్‌.నాగులరాజు, జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌ కడవెండి, ఎ.భానుప్రసాద్‌, ప్రిన్సిపాల్‌, పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ టీజీఎంఎస్‌ కొడకండ్ల, డి.రవీందర్‌, ఎస్‌ఏ, జెడ్పీహెచ్‌ఎస్‌ మండలగూడెం, బి.శంకర్‌, ఎస్‌ఏ, పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్పీహెచ్‌ఎస్‌ కొలనుకొండ, ఎ.రాజానరేశ్‌, ఎస్‌ఏ, యూపీఎస్‌ బొంతగట్టు నాగారం, ఎ.అశోక్‌కుమార్‌,ఎస్‌ఏ, జెడ్పీహెచ్‌ఎస్‌ చీటూరు, ఎ.సుమలత, ఎస్‌ఏ, ,ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జనగామ, టి.పద్మజ, పీఎస్‌హెచ్‌ఎం, ఎంపీపీఎస్‌ శ్రీపతిపల్లి, జి.శంకరయ్య, పీఎస్‌హెచ్‌ఎం, ఎంపీపీఎస్‌ కొలనుకొండ, కె.గణేశ్‌, పీజీటీ, టీజీఎంఎస్‌ వెల్ది, డి.సూర్యప్రకాశ్‌, ఎస్‌జీటీ, ఎంపీపీఎస్‌ దర్దెపల్లి, వి.రజిత, ఎస్‌జీటీ, ఎంపీపీఎస్‌ హక్యాతండా, జి.శ్రీనివాసరెడ్డి, ఎస్‌జీటీ, ఎంపీపీఎస్‌ పోచన్నపేట, బి.రజిత, ఎస్‌జీటీ, ఎంపీపీఎస్‌, ఖిలాషాపూర్‌, డి.రామానుజం, ఎస్‌జీటీ, ఎంపీపీఎస్‌ తిమ్మంపేట, టి.సునీత, ఎస్‌జీటీ, ఎంపీపీఎస్‌ కంచనపల్లి, జ్యోతి, ఎస్‌జీటీ, ఎంపీపీఎస్‌, మచ్చుపహాడ్‌, టి.ఆరోగ్యమేరీ, ఎస్‌జీటీ, యూపీఎస్‌, యశ్వంత్‌పూర్‌, కె.జయశ్రీ,ఎస్‌జీటీ, యూపీఎస్‌, రాఘవాపూర్‌ , బి.నవీన, స్పెషల్‌ ఆఫీసర్‌, కేజీబీవీ, జఫర్‌గఢ్‌, బి.సరిత, పీజీసీఆర్‌టీ, కేజీబీవీ పాలకుర్తి, వి.సుగుణ, సీఆర్‌టీ, కేజీబీవీ కొడకండ్ల, పి.శ్రీదేవి, సీఆర్‌టీ, కేజీబీవీ, స్టేషన్‌ఘన్‌పూర్‌ టి.మహాలక్ష్మి, పీఈటీ, కేజీబీవీ, జఫర్‌గఢ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement