తాత్కాలిక ఉద్యోగాల రాత పరీక్ష | - | Sakshi
Sakshi News home page

తాత్కాలిక ఉద్యోగాల రాత పరీక్ష

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

హాజరైన 110 మంది అభ్యర్థులు

జనగామ: మున్సిపాలిటీలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. అన్‌న్‌స్కిల్డ్‌ శానిటేషన్‌ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, హెవీ వెహికల్‌ డ్రైవర్ల పోస్టుల భర్తీ కోసం జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పరీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పర్యవేక్షణలో అధికారులు పరీక్ష ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. మున్సిపాలిటీలో 30 అన్‌స్కిల్డ్‌ శానిటేషన్‌ వర్కర్‌ పోస్టుల భర్తీకి మొత్తం 45 దరఖాస్తులు అందాయి. వీరిలో 34 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా 4 ఎలక్ట్రీషియన్‌ పోస్టులకు 34 దరఖాస్తులు రాగా, 32 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అలాగే మున్సిపాలిటీలో 20 హెవీ వెహికల్‌ డ్రైవర్‌ పోస్టుల భర్తీకి 47 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 44 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. మూడు విభాగాలకు సంబంధించి మొత్తం 54 పోస్టులకు 126 దరఖాస్తులు అందగా, 110 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement