● వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలి
● మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
బచ్చన్నపేట : ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్నదాతలు పండ్ల తోటలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సూచించారు. ఆదివారం మండలంలోని పోచన్నపేట శివారు గ్రామమైన కాశీనగర్ వద్ద జరిగిన ప్రైవేట్ హనుమాన్ విగ్రహ ప్రతిష్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తక్కువ వర్షపాతం నమోదైందని, దీంతో దినదినం భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో అన్నదాతలు కేవలం వరి పంటలను మాత్రమే సాగు చేస్తున్నారని తక్కువ నీటితో పండే ఉధ్యానవన పంటలను సాగు చేయాలని తెలిపారు. పామాయిల్ తోటలను సాగు చేసి మూడు సంవత్సరాల తరువాత అన్నదాతలు నికర ఆదాయం పొందవచ్చునన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు కురియక 200 ఏళ్ల క్రితం కరువు మళ్లీ గుర్తుకు వస్తోందని, దానిని త్వరలోనే చూస్తారని తెలిపారు. కార్యక్రమంలో చౌదరి, పలువురు పాల్గొన్నారు.


