జనగామ: జిల్లా కేంద్రంలోని బీరప్పగడ్డ నుంచి అమ్మవారి పలారం బండి శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గొర్రె పొట్టలతో అలంకరించిన పలారం బండిపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి నిర్వహించిన ఈ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శోభాయాత్ర సందర్భంగా దేవతామూర్తుల వేషధారణలు, శివశక్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కాళికామాత వేషధారణ భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.


