జనగామను వీడే ప్రసక్తే లేదు..
● ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్న..
● జన్మభూమి స్టేషన్‌ఘన్‌పూర్.. కర్మభూమి జనగామ
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: నేను పుట్టిన జన్మభూమి స్టేషన్‌ఘన్‌పూర్, నా కర్మభూమి జనగామ, రాజకీయాల్లో అవకాశం ఉన్నంతకాలం ఇక్కడే ఉంటా, ఇల్లు కూడా కట్టుకుంటున్నా, నేను చస్తేనే వదులుతా తప్ప అప్పటి వరకు వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి స్థానిక బస్టాండ్ వరకు ఎమ్మెల్యే పల్లా ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా మొండివైఖరితో వ్యవహరిస్తోందని నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతు బీమా పథకాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు గాలిలో కలిపేసిందన్నారు. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడం సరికాదన్నా రు. కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలున్నారు.
● బీఆర్‌ఎస్ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు
● జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
● పట్టణంలో భారీ ర్యాలీ, 1000 రోజుల సంబురాలు
జనగామ: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో దోచుకోవడం తప్ప, అభివృద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ జనగామ ని యోజకవర్గ ఇన్‌చా ర్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రె డ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తైన సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి కొమ్మూరి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతిలక్ష్మీనారాయణ నాయక్ పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం నెహ్రూపార్కు, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం మీదుగా సిద్దిపేట రోడ్డులోని గాయత్రి గార్డెన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదింట్లో వెలుగులు నింపుతున్నారన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, లింగం యాదవ్, గజ్జి భాస్కర్, కడకంచి బాల మణిశ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.


