స్మారక చిహ్నం..
యునెస్కో గుర్తింపుతో రామప్ప కళ నలుదిశలా పరివ్యాప్తి చెందింది. ఇక్కడ కట్టడాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అదే తరహాలో గత నెలలో రామప్ప సమీపంలోని గొల్లాల గుడిని, జూలైలో శివ తారకేశ్వరాలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో రామప్పకు మరింత పర్యాటక శోభ సంతరించుకోనుంది. ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందనుంది. ఈనేపథ్యంలో పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లిన ఈ రెండు ఆలయాల ప్రత్యేకతలే సాక్షి సండే స్పెషల్.. – ములుగు


