‘డబుల్‌’ ఇళ్ల కేటాయింపునకు డ్రా | - | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ ఇళ్ల కేటాయింపునకు డ్రా

Sep 6 2026 1:19 AM | Updated on Sep 6 2026 1:19 AM

957 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక

జనగామ: జిల్లాలోని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించే ప్రక్రియలో భాగంగా శని వారం లబ్ధిదారుల ఎంపికకు డ్రా నిర్వహించారు. జనగామ, పాలకుర్తి, బచ్చన్నపేట, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో మొత్తం 957 ఇళ్లకు అర్హుల ను ఎంపిక చేపట్టారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది.

రెండు దశల్లో ఎంపిక

అర్హుల జాబితా తయారీలో ఇందిరమ్మ ఇళ్ల ఎల్‌–2 జాబితా, గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకున్న వారు, ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అందించిన పేర్లను పరిశీలించారు. అర్హులైన కుటుంబాలందరీ పేర్లను ఒకే జాబితాలో చేర్చి డ్రా నిర్వహించారు. తొలుత అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి, అనంతరం ఎంపికై న వారికి ఇళ్లను కేటాయించేందుకు రెండో దశలో డ్రా తీశారు.

పూర్తి పారదర్శకతతో ప్రక్రియ

నిబంధనల మేరకు పారదర్శకంగా డ్రా నిర్వహించడంతో పాటు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డు చేశారు. జిల్లా స్థాయి కమిటీ సమక్షంలో డ్రా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో భారీ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేయడంతో లబ్ధిదారులు ప్రక్రియను వీక్షించారు.

తొలుత తాత్కాలిక ఉత్తర్వులు

డ్రాలో ఎంపికై న వారికి తొలుత తాత్కాలిక కేటా యింపు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అనంత రం మండలస్థాయి బృందాలు క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలిస్తాయి. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత తుది కేటాయింపు ఉత్తర్వులతో పాటు ఇళ్ల స్వాధీ నం అప్పగించనున్నారు. కాగా ఎంపికై న లబ్ధిదారులు, వెయింటింగ్‌ జాబితాలను జీపీలు, మున్సిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షా లోమ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి, బీఆర్‌ఎస్‌ తరుఫున బాల్దె సిద్ధిలింగం, డీసీపీ రాజ మహేంద్రనాయక్‌, ఆర్డీఓ గోపిరాం, కమిషనర్‌ రా జశేఖర్‌రెడ్డి,తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement