హోరెత్తిన శ్రీకృష్ణనామం | - | Sakshi
Sakshi News home page

హోరెత్తిన శ్రీకృష్ణనామం

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

జనగామ: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రంలో కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ అధ్యక్షు డు కానుగంటి ముత్తయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన రథయాత్ర.. కళాకారుల డప్పు చప్పుళ్లు, కో లాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, డీజే సౌండ్ల మధ్య భక్తుల కృష్ణ నామస్మరణతో ర్యాలీ నెహ్రూపా ర్క్‌ చౌరస్తా మీదుగా బతుకమ్మకుంటకు చేరుకుంది. బతుకమ్మ కుంట వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఎంపీ అంజనన్‌ కుమార్‌ యాదవ్‌, గొర్రెలు, మేకల మాజీ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌, యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌, జనగామ ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ మారబోయిన పాండు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి టెంపుల్‌ మెంబర్‌ ఈశ్వరమ్మ, మారబోయిన సంతోష్‌ యాదవ్‌, సలేంద్ర మల్లేష్‌ యాదవ్‌, వారాల రమేశ్‌, శ్రీధర్‌ యాదవ్‌, బూస రమేశ్‌ తదితరులు ఉన్నారు.

యాదవులకు న్యాయమైన ప్రాతినిథ్యం

కల్పించాలి..

యాదవులు ఈర్ష్య, ద్వేషాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకొచ్చి తమ హక్కులు, సమస్యల సాధన కోసం పోరాడాలని మాజీ ఎంపీ అంజన్‌న్‌కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతి థిగా పాల్గొని మాట్లాడారు.. యాదవులకు రాజకీయంగా న్యాయమైన ప్రాతినిథ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అనేక కులాలు, వర్గాలకు ప్రాతినిథ్యం లభిస్తున్న నేపథ్యంలో యాదవులకు కేబినెట్‌లో తగిన ప్రాతినిథ్యం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. యాదవుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కు తరలిరావాలని కోరారు. లక్ష మంది యాదవులు ఒకే వేదికపైకి వచ్చి తమ డిమాండ్లను ముఖ్యమంత్రికి వినిపిస్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. శ్రీ కృష్ణుడి బోధనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని అన్నారు.

పట్టణంలోని శ్రీ హనుమాన్‌ దేవాలయంలో

ఉట్టి కొడుతున్న శ్రీ కృష్ణ వేషధారణ చిన్నారులు

యాదవుల ఆధ్వర్యంలో

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా రథయాత్ర, బతుకమ్మకుంట వద్ద ఉట్టికొట్టే కార్యక్రమం

హాజరైన యాదవ ప్రముఖులు తలసాని, అంజన్‌కుమార్‌ యాదవ్‌

ఉత్సాహంగా ఉట్లు కొట్టి..

జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పూర్ణిమా కాలనీ, గీతాశ్రమం, మూలబావి శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో ఉట్టికొట్టే కార్యక్రమాలతో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతి థి విభాగ్‌ సంఘటన మంత్రి శివరాములు హాజరు కాగా, జిల్లా అధ్యక్షుడు ఎనగందుల భిక్షపతి, కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, నాయకులు పాశం శ్రీశైలం, బాలనా రాయణ, కుందారపు బైరునాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement