జనగామ: శ్రీ కృష్ణుడి బోధనలు, భగవద్గీత సందేశాలను పిల్లలు తెలుసుకుని, సన్మార్గంలో నడవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని గీతాశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వే డుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుడి వేషధారణలో వచ్చిన చిన్నారులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ.. గీతాశ్రమం ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కొడిపాక ప్రభాకర్, బాలరాజు, నాగరాజు, కౌన్సిలర్లు గునిగంటి వెన్నెల రామక్రిష్ణ, బుక్కా బాలభరధ్వాజ్, కిషోర్, నవీన్, శ్రీనివాస్ ఉన్నారు.
ఎకై ్సజ్ శాఖలో బదిలీలు
కాజీపేట అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో బదిలీలు చేపట్టి ఎకై ్సజ్, రిజిస్ట్రేషన్ శాఖలో ఎప్పుడు బదిలీలు అంటూ జరుగుతున్న చర్చకు ముగింపు పడింది. ఎట్టకేలకు ఎకై ్సజ్ శాఖలో బదిలీల ప్రక్రియ చోటు చేసుకుంది. తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎకై ్సజ్‌శాఖలో రెండు రోజుల క్రితం బదిలీల ఉత్తర్వులు రాగా, హనుమకొండ జిల్లాలో నూతనంగా ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లు బాధ్యతలను స్వీకరించారు. ఎకై ్సజ్ సీఐలు ఇలా.. ఏఎంఎల్ డిపోకు – ఎల్.రామకృష్ణ, హనుమకొండ – ఎం.శ్రీనివాస్, వరంగల్ అర్బన్ – పి.స్వప్న, ఖిలా వరంగల్ – ఎల్.అచ్చారావు, కాజీపేట – ఆర్.రాజు, హసన్‌పర్తి – ఎం.ప్రసాద్, డీటీఎఫ్ – గంగారెడ్డి.
తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో..
రెండేళ్ల క్రితం జూలై 25న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అటెండర్ స్థాయి నుంచి డీఐజీ స్థాయి వరకు బదిలీలు జరిగాయి. రెండేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకుని నెలన్నర గడుస్తున్నా రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీల పర్వం ప్రారంభం కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 5 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పూర్తి స్థాయి సబ్ రిజిస్ట్రార్లు మిగతా 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. ఎకై ్సజ్ శాఖలో బదిలీలు ప్రారంభం కాగా తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఘనంగా స్మార్త కృష్ణాష్టమి పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కాళీ జయంతి స్మార్త కృష్ణాష్టమి పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడిగా రుద్రేశ్వర స్వామిని అలంకరించి పూజించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
కృష్ణాలంకరణలో
భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దంపతులు, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ శ్వేత అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారికి కృష్ణాలంకారం జరిపారు. అనంతరం రాత్రి 10గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజాము వరకు భక్తులు జాగరణ చేశారు.


