జనగామ రూరల్: మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 5,081 మంది లబ్ధిదారులలో 174 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపునకు శనివారం డ్రా నిర్వహించనున్న ట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సంబంధిత లబ్ధిదారుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డుపై ప్రదర్శించారు. ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయ నోటీస్ బోర్డులో తమ పేరును పరిశీలించుకోవాలని కోరారు. శనివారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో లక్కీ డ్రా ఉంటుందని తెలిపారు. లబ్ధిదారులు నిర్ణీత సమయానికి హాజరై డ్రా ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.


