● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ఉమ్మడి వరంగల్‌లోనే జిల్లా రీసర్వే ప్రక్రియలో ముందంజలో ఉందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. భూ రికార్డులను మరింత పకడ్బందీగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన రీసర్వే ప్రక్రియలో భాగంగా పెంటాక్స్ కంపెనీ ఐదు డీజీపీఎస్ రోవర్‌ను గురువారం కలెక్టర్ కార్యాలయంలో ల్యాండ్స్ అండ్ సర్వే అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అందుబాటులోకి వచ్చిన డీజీపీఎస్ రోవర్స్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ క్షేత్రస్థాయిలో సర్వే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 82 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ల్యాండ్స్ అండ్ సర్వే ఏడీ మన్యంకొండ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


