స్వచ్ఛ గ్రామాలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ గ్రామాలే లక్ష్యం

Sep 3 2026 4:15 AM | Updated on Sep 3 2026 4:15 AM

జనగామ: గ్రామాలను సంపూర్ణ పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (ఎస్‌బీఎం) ఆధ్వర్యంలో జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నారు. 280 గ్రా మ పంచాయతీల పరిధిలో సోక్‌పిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సామూహిక పారిశుధ్య సముదా యాలు తదితర పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాల అవసరాలను బట్టి పనులు చేపట్టే వెసులుబాటు కల్పించడంతో స్వచ్ఛత కార్యక్రమాలు మరింత వేగం పుంజుకోనున్నాయి.

మురుగు నీటికి సోక్‌పిట్లే పరిష్కారం..

గ్రామాల్లో ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు రోడ్లపైకి చేరకుండా భూమిలోకి ఇంకిపోయేలా సోక్‌పిట్ల నిర్మాణం చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 300 సోక్‌పిట్లకు మంజూరు ఇవ్వగా 20 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కో సోక్‌పిట్‌కు రూ.92,747 వ్య యం అవుతుంది. ఇందులో రూ.64,923 స్వచ్ఛ భారత్‌ మిషన్‌న్‌ నుంచి, రూ.27,824 గ్రామ పంచా యతీ వాటాగా సమకూరుతాయి. ఒక్క గ్రామానికి ఒక్కటే అనే పరిమితి లేకుండా అవసరాన్ని బట్టి ఎన్ని సోక్‌పిట్లైనా నిర్మించుకునే అవకాశం కల్పించారు. సోక్‌పిట్ల ద్వారా మురుగు నీరు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉండకుండా చేయడంతో దోమలు, ఈగలు, దుర్వాసన తగ్గి పరిసరాలు పరిశుభ్రంగా మారే అవకాశం ఉంటుంది. నీరు నేలలోకి ఇంకడం వల్ల భూగర్భ జలాల రీచార్జ్‌కు కూడా కొంతమేర దోహదపడుతుంది. అందువల్ల గ్రామీణ పారిశు ద్ధ్యంలో సోక్‌పిట్లు కీలకంగా మారుతున్నాయి.

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి

గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జనకు అడ్డుకట్ట వేసేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో వ్యక్తిగత మరుగుదొడ్డికి రూ.12 వేల ప్రోత్సాహక నగదు అందించే విధానం ఉంది. అర్హత కలిగిన బీపీఎల్‌ కుటుంబాలు, ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలు, వ్యక్తిగత బ్యాంకు ఖాతా ఉన్న వారు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం

ప్రజలకు అవసరమైన చోట సామూహిక పారిశుద్ధ్య సముదాయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షల వరకు వ్యయం చేయగా, ఇందులో రూ.2.10 లక్షలు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నుంచి, రూ.90 వేల వరకు గ్రామ పంచాయతీ వాటా ఉంటుంది. సుమారు 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల కోసం భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పారిశుధ్య సదుపాయాలు వంటి పనులకు కూడా నిధులు అందిస్తున్నారు. ఈ పనులన్నీ పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. సోక్‌పిట్‌ నుంచి వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల వరకు ప్రతి ఇంటికీ, ప్రతి గ్రామానికి పారి శుధ్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ‘స్వచ్ఛ గ్రామం–ఆరోగ్య గ్రామం’ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి నిర్ణీత నమూనాలో దరఖాస్తు ధ్రువీకరణ పత్రం, గ్రామసభ తీర్మానం కాపీని జతపరిచి ఎంపీడీఓ కార్యాలయాల్లో అందించాలి. ఎస్‌బీఎం పర్యవేక్షణలో పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలో ఎస్ట్‌మేషన్‌, కొలతలు తదితర పనులకు సంబంధించి ఉపాధిహామీ విభాగం చూస్తుంది.

సోక్‌పిట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు

పల్లె పరిశుభ్రతకు ‘సోక్‌పిట్‌’ బలం

మురుగు నీటికి మంగళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement