నర్మెట: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండలంలోని మచ్చుపహాడ్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యాబోధన, మౌలిక వసతులు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం వంటశాలను పరిశీలించి విద్యార్థులకు సైన్స్ పాఠాలను బోధించారు. అనంతరం బొమ్మకూర్‌లో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ సవరణల కార్యక్రమాన్ని పరీశీలించి తహసీల్దార్ కలకుంట్ల వెంకటరామానుజాచార్యులును వివరాలు అడిగి తెలసుకుని పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్‌ఐ సింగారపు సాయిబాబా, హెచ్‌ఎం గోపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశ్విని తదితరులు ఉన్నారు.
పారదర్శకంగా ‘డబుల్’ ఇళ్లు..
జనగామ రూరల్: జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు నిర్వహించి, అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్‌న్స్ హాల్లో ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన లబ్ధిదారుల తుది జాబితా ఖరారుపై డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


