పాల ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం | - | Sakshi
Sakshi News home page

పాల ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం

Sep 3 2026 4:15 AM | Updated on Sep 3 2026 4:15 AM

జనగామ: పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సంఘాల స్థాయిలో ఆర్థిక నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు విజయ డెయిరీ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌.గోపాల్‌సింగ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో బుధవారం డీసీసీబీ జనరల్‌ మేనేజర్‌, నాబార్డు, ఎల్‌డీఎం, కాకతీయ కో–ఆపరేటివ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌, స్పెషల్‌ క్యాడర్‌ ఎస్‌సీడీఆర్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రతినిధులు, డీసీఓ, పాల ఉత్పత్తిదారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..సహకార సంఘా ల స్థాయిలో ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు, పారదర్శకతను పెంపొందించేందుకు మైక్రోఏటీఎంలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం మైక్రో ఏటీఎంలను పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కాశరపు ధర్మా రెడ్డి, ఉపాధ్యక్షుడు దామెర నాగరాజు, ఎల్‌డీఎం ప్రతిభ, నాబార్డు ఏజీఎం విజయ్‌ కుమార్‌, కాకతీ య సహకార సంఘాల శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ యాకూబ్‌ నాయక్‌, డీసీసీబీ జనరల్‌ మేనేజర్‌ శిరీ ష, డీసీసీబీ మేనేజర్‌ సంతోషిణి, విజయ డెయిరీ మేనేజర్‌ డాక్టర్‌ నరేష్‌, లింగారెడ్డి, పాల సంఘాల అధ్యక్షులు సాదం రమేశ్‌, సోమి రెడ్డి, శ్రీనివాస్‌, భద్రారెడ్డి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

విజయ డెయిరీ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌.గోపాల్‌సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement