జనగామ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ధన్వంతి మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత అని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, వేముల మల్లేశం, చింతకింది మల్లేశం, మల్లేశం, సమ్మయ్య పాల్గొన్నారు.


