రఘునాథపల్లి: అధికారం కోల్పోయామని బీఆర్‌ఎస్,, అధికారం కోసం బీజేపీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని, వాటిని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాదె మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నూతన గ్రామ కమిటీ అధ్యక్షుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా కడియం మాట్లాడు తూ.. బీఆర్‌ఎస్ ఖాతాలోని రూ.1,400 కోట్లు ఉద్యమకారుల కుటుంబాలకు పంచాలన్న కవిత వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. గ్రూపులకు దూరంగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, జగదీష్‌చందర్‌రెడ్డి, ఇందిర పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి,
ఎంపీ కడియం కావ్య


