జనగామ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పోకల జమున, పార్టీ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 5న నిర్వహించనున్న మహిళా, రైతుల ధర్నా కార్యక్రమాలకు మహిళలు, రైతులు భారీసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించేందుకు ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. కౌన్సిలర్లు సువార్త, మంజుల, అనూష, వెన్నెల, హాఫీజ్ ఫాతిమా, మాజీ కౌన్సిలర్ అనిత, నాయకులు అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
రూ.5 కోట్ల ప్రచార
హక్కులకు ఓపెన్ టెండర్లు
జనగామ: మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రచార స్థలాలపై ప్రకటన హక్కుల కేటాయింపునకు మున్సిపాలిటీ ఓపెన్ టెండర్లను ఆహ్వానించినట్లు కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. రూ.5 కోట్ల అంచనా కాంట్రాక్ట్ విలువతో ఈ టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 12 టీ–పోల్స్, 14 బిల్డింగ్ సైట్ హోర్డింగ్స్, 8 బస్‌షెల్టర్లు, 166 లాలీపాప్ హోర్డింగ్స్ తదితర ప్రకటన స్థలాలపై హక్కుల ను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ప్రకటనల ఏర్పా టు, నిర్వహణకు సంబంధించిన హక్కులను టెండర్ ద్వారా కేటాయించనున్నారు. టెండరు కోసం బిడ్ల సమర్పణ ఈ నెల 1న ఉదయం 11 గంటలకు ప్రారంభమై 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముగియనున్నట్లు పేర్కొన్నారు. అర్హ త కలిగిన సంస్థలు, ఏజెన్సీలు, వ్యక్తులు తెలంగాణ ఈ–ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా టెండర్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. టెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత ప్రమాణా లు, నిబంధనలు ఈ–ప్రొ క్యూర్‌మెంట్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అర్హతగల వారు నిర్ణీత గడువులోగా బిడ్లను సమర్పించి ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
పుష్పాలంకరణలో
రేణుకా ఎల్లమ్మ
జనగామ: శ్రావణమాసం మూడో మంగళవారం సందర్భంగా పట్టణంలోని 3వ వార్డు బాలాజీనగర్ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పూజారి మారుపాక శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారిని రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి బోనం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కుంకుమ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో దూడల శోభారాణి, లగిశెట్టి పద్మావతి, మారుపాక విజయ, గోరిగె సత్తెమ్మ, ఎనగం దుల రేణుక, చెరుకూరి మౌనిక, బండోజు సరళ, అయిత కళావతి, కల్పన, పొత్కనూరి మౌనిక, చెంచారపు మంజుల తదితరులు పాల్గొన్నారు.
ఇరిగేషన్ కార్యాలయాన్ని జిల్లాకేంద్రానికి మార్చాలి
పాలకుర్తి టౌన్: ఇరిగేషన్ డివిజన్ నంబర్–6 ప్రధాన కార్యాలయాన్ని హనుమకొండ నుంచి జిల్లా కేంద్రానికి మార్చాలని నియోజకవర్గ రైతులు ప్రభుత్వాన్ని కోరారు. 2021లో పాలకుర్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం అనువైన ప్రభుత్వ భవనాల లేమితో 2026 మార్చిలో హనుమకొండకు తరలించారన్నారు. ప్రస్తుతం జనగామ ఇరిగేషన్ క్యాంపులో అనువైన ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాలకుర్తి నుంచి హనుమకొండ దూరం ఎక్కువగా ఉండటంతో రైతులు నీటిపారుదల సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యాలయాన్ని జిల్లాకేంద్రానికి మార్చితే పరిపాలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని చెప్పారు.


