పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

Sep 2 2026 2:52 AM | Updated on Sep 2 2026 2:52 AM

కలెక్టరేట్‌ ఎదుట నిరసనలో టీజీఈ జేఏసీ నేతలు

జనగామ రూరల్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్‌ సామాజిక భద్రతను దెబ్బతీసే పెన్షన్‌ విధానాలను వ్యతిరేకిస్తూ, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీఈ జేఏసీ సెక్రటరీ కొర్నేలి యస్‌ అన్నారు. మంగళవారం పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా కో–చైర్మన్‌ చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్‌ సమస్యపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయని, ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి పెండేల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లో జరిగే మహా ధర్నాకు వేలాది తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. నిరసనలో ఖాజా షరీఫ్‌, లక్ష్మణమూర్తి, మాడూ రి వెంకటేష్‌, రామస్వామి, రాజయ్య, మనోజ్‌, కృష్ణమూర్తి, రాంనర్సయ్య, జ్యోతి, సంపత్‌ కుమార్‌, రాజా నర్స య్య, రాజు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement