కవిత ఆరోపణలపై సమాధానం చెప్పండి | - | Sakshi
Sakshi News home page

కవిత ఆరోపణలపై సమాధానం చెప్పండి

Sep 2 2026 2:52 AM | Updated on Sep 2 2026 2:52 AM

బీఆర్‌ఎస్‌ నేతలకు

ఎమ్మెల్యే కడియం డిమాండ్‌

జఫర్‌గఢ్‌: లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అక్రమంగా సంపాందించిన డబ్బును ఇంకా లెక్కపెడుతున్నారని కల్వకుంట్ల కవిత చేసిన అరోపణలకు బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని తిమ్మంపేటలోని ఓ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన పార్టీ మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరి చయ కార్యక్రమంతో పాటు మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు అరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. దొరల గడిల పాలన నుంచి ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు నూకల ఐలయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ తీగల కర్ణాకర్‌రా వు, డీసీసీ ప్రధాన కార్యదర్శులు అన్నెబోయిన భిక్షపతి, ఇల్లందుల బేబి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, జిల్లా నాయకులు అన్నం బ్రహ్మారెడ్డి, కట్టా మనోజ్‌రెడ్డి, గుజ్జరి రాజు, రడపాక సుదర్శన్‌, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement