● రైతు విజ్ఞాన కేంద్రం
జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రమ్య
స్టేషన్‌ఘన్‌పూర్: ఆయిల్‌పామ్ సాగులో రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సరైన మెళకువలను పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రమ్య అన్నారు. మంగళవారం ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో, మండలంలోని రాఘవాపూర్‌లో ఆయిల్‌పామ్ పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కరుణాకర్‌తో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం ఆయిల్‌పామ్‌లో ముక్కు పురుగు ఉధృతిని అరికట్టేందుకు రైతులకు లింగాకర్షక బుట్టలు, మెటారైజియం బయో పురుగుల మందులను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎస్ ఆయిల్‌ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, ఏఈఓ అనిత, రైతులు ఆకుల రమేశ్, కుమార్, ప్రదీప్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


