జనగామ రూరల్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయక వారి జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆరోపించారు. సోమవారం పార్టీ, యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని జిల్లా కేంద్రంలో ఒక రోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు విడుదల చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీష్, రాష్ట్ర నాయకులు రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమారాణి, కొంతం శ్రీనివాస్, అంజిరెడ్డి, కుమార్ పాల్గొన్నారు.


