కొనాలంటే షాక్‌ | - | Sakshi
Sakshi News home page

కొనాలంటే షాక్‌

Aug 31 2026 1:14 AM | Updated on Aug 31 2026 1:14 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026

విద్యుత్‌

సామగ్రి

జనగామ: విద్యుత్‌ సామగ్రి ధరలు సామాన్యులు, రైతులకు గట్టి షాక్‌ ఇస్తున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే ఎలక్ట్రికల్‌ పరికరాల ధరలు సగటున 20 నుంచి 30 శాతం వరకు పెరగగా, వ్యవసాయ బోరు మోటార్లకు వినియోగించే వైండింగ్‌ వైరు, కేబుల్‌ వైరు, స్టార్టర్లు, బుష్‌లు తదితర సామగ్రి ధరలు 50 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇంటి నిర్మాణ ఖర్చుతో పాటు వ్యవసాయ మోటార్ల మరమ్మతులు, కొత్త మోటార్ల కొనుగోలు రైతులకు అదనపు భారంగా మారుతున్నాయి.

ఇంటి వైరింగ్‌కూ అదనపు భారం

విద్యుత్‌ సామగ్రి ధరల పెరుగుదల ప్రభావం ఇళ్ల నిర్మాణంపైనా పడుతోంది. గతంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి సంబంధించి పూర్తి స్థాయి ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ సుమారు తక్కువలో తక్కువ రూ.45 వేల బడ్జెట్‌లో పూర్తయ్యేది. ప్రస్తుతం అదే పనికి రూ.65 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతున్న పరిస్థితి నెలకొంది. అంటే కనీసం రూ.20 వేల నుంచి రూ.25వేల అదనపు వ్యయం, సుమారు 44 నుంచి 55 శాతం వరకు పెరిగిన భారం కుటుంబాలపై పడుతోంది.

రైతులపై రెట్టింపు ప్రభావం

వ్యవసాయానికి అవసరమైన మోటార్లు, కేబుల్‌ వైర్లు, వైండింగ్‌ వైర్లు, స్టార్టర్లు, బుష్‌లు తదితర సామగ్రి ధరలు పెరగడంతో రైతులకు కొత్త మోటారు కొనుగోలు చేసినా, పాత మోటారుకు మరమ్మతులు చేయించినా ఖర్చు తప్పడం లేదు. దీనికి తోడు మోటారు వైండింగ్‌, మరమ్మతులకు మెకానిక్‌ చార్జీలు సైతం పెరగడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఇప్పటికే సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్‌ సామగ్రి ధరల పెరుగుదల రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత ప్రభావితం చేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధరలను నియంత్రించాలి..

మాకున్న ఆరు ఎకరాల వ్యవసాయ పొలంలో పంటల సాగు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం బోర్‌ మోటార్‌ రిపేర్‌ కోసం రూ.5వేల వరకు ఖర్చవుతుంది. ఈసారి మోటార్స్‌ సంబంధించిన సామగ్రి కాపర్‌ వైర్‌, బుష్‌, తదితర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఆర్థిక భారం పెరిగిపోయింది. వ్యవసాయ మోటార్లకు సంబంధించిన సామగ్రి ధరలను ప్రభుత్వం నియం త్రించాలి.

–గట్టు శ్రీనివాస్‌,రైతు,స్టేషన్‌ ఘన్‌పూర్‌

రూ.70 వేల ఖర్చు చేశా..

నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాం. స్లాబ్‌ వేసే సమయంలో పైపులు, వైరింగ్‌, స్విఛ్‌ బోర్డులకు రూ.70 వేల ఖర్చు అయింది. స్విఛ్‌ బోర్డులకే రూ.25వేలు అయ్యాయి. ఇంకా లేబర్‌ చార్జీలు మరో రూ.30 వేలకు పైగానే అయ్యేటట్లు ఉన్నాయి. రెండు బెడ్‌రూంలో ఒక హాల్‌లోనే లక్షకు పైగా ఖర్చు వచ్చింది. విపరీతంగా పెరిగిన విద్యుత్‌ మెటీరియల్‌తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇల్లు నిర్మించుకోవాలంటేనే చాలా భయంగా ఉంది.

–కుంటి మహేందర్‌, లింగాలఘణపురం

మూల్యాంకనం..ఇక ఎమ్మార్సీలో

రైతులు, సామాన్యులపై పెరిగిన ధరల భారం

ఆకాశాన్నంటిన మోటార్లు, వైర్లు,

స్టార్టర్ల ధరలు

నాలుగు నెలల్లోనే భారీ పెరుగుదల

వైండింగ్‌ వైరు నుంచి బోరు మోటార్‌ వరకు ధరల మోత

వ్యవసాయ మోటారు సామగ్రిపై

50 శాతానికి పైగా భారం

ఇంటి వైరింగ్‌ బడ్జెట్‌ రూ.45 వేల

నుంచి రూ.65 వేలకు పెరుగుదల

సామగ్రి పాత ధర ప్రస్తుత ధర

మోటారు వైండింగ్‌ వైరు(కిలో) 1,000 1,400

కంపెనీ స్టార్టర్‌ 2,200 3,000

2.5 గేజ్‌ కేబుల్‌(మీటర్‌) 80 125

5 హెచ్‌పీ బోరు మోటారు 22,000 26,000

7 హెచ్‌పీ బోరు మోటారు 24,000 32,000

4.0 వైరు(90 మీ.బండిల్‌) 4,800 6,600

2.5 వైరు (90 మీ.బండిల్‌) 3,700 4,850

1.0 వైరు (90 మీ.బండిల్‌) 1,350 2,100

2.5 అంగుళాల పీవీసీ పైపు 450 600

3 పిన్‌ సాకెట్‌ 160 250

మోటారు బుష్‌లు (కిలో) 750 1,250

ఫ్యాన్‌ రెగ్యులేటర్‌ 220 350

స్టీల్‌ నల్లా 300 500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement