జనగామ రూరల్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ కోరారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు అందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 31న జిల్లా కేంద్రం చౌరస్తాలో ఒక రోజు దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రీయింబర్స్‌మెంట్ అందించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో యువ మోర్చా పోరాటం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిడుగుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, జిల్లా సెక్రెటరీ సతీష్, జగదీష్, చందర్ తదితరులు పాల్గొన్నారు.


