● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
కొడకండ్ల: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ వేడుకలు నిలుస్తాయని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం మైదంచెరువుతండా, శ్రీరాంతండా, గిర్నితండాలు సంయుక్తంగా నిర్వహించిన తీజ్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్‌నాయక్, రాజేష్‌నాయక్, సర్పంచ్‌లు సుధీర్‌నాయక్, సోనియానరేష్‌నాయక్ పాల్గొన్నారు.


