పాలకుర్తి టౌన్: సాధారణంగా సోదరీసోదరుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండగను ఓ కుటుంబం గోమాతలతో జరుపుకుంటోంది. గోసంరక్షణే ధ్యేయంగా గోమాతలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ పూజించి, వాటి నూదిటిపై తిలకం దిద్ది, వాటి రక్షణను కోరుతూ రాఖీ కట్టి వేడుకలను నిర్వహిస్తారు. గురువారం మండల కేంద్రానికి చెందిన దేవగిరి భార్గవి కుటుంబసభ్యులతో కలిసి గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు తిలకం దిద్ది రాఖీలు కట్టారు. అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు ఏర్పాటు చేశారు.


