బచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన చిట్టి నర్సిరెడ్డి బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో పనిచేస్తున్నారు. నర్సిరెడ్డి అక్క వంగ రమ్య ప్రతీ సంవత్సరం పండుగకు రాఖీలను నేరుగాకట్టే అవకాశం లేకపోవడంతో పోస్టులో పది రోజుల ముందుగానే పంపిస్తుంది. రాఖీ అందగానే తమ్ముడు నర్సిరెడ్డి ఫోన్ చేసి తెలుపుతాడు. రాఖీ పౌర్ణమి పండుగ రోజున ఫోన్‌లో వీడియో కాల్ చేసి రాఖీని తమ్ముడు నర్సిరెడ్డి కట్టుకుంటాడు. ప్రతి రాఖీ పౌర్ణమికి రాఖీలను తప్పకుండా పంపిస్తానని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.


