ఎస్‌ఐఆర్‌లో అధికారుల జారీ
గ్రామసభల్లో వెలుగులోకి తప్పులు
జనగామ: జిల్లాలో ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నియోజకవర్గాల వారీగా భారీ సంఖ్యలో అసాధారణతలు గుర్తించారు. జనగామ నియోజకవర్గంలో 55,974 నోటీసులు, ఘన్‌పూర్ నియోజకవర్గంలో 37,963, పాలకుర్తి నియోజకవర్గంలో 69,954 నోటీసులు జారీ చేయాల్సి ఉంది. మూడు నియోజకవర్గాలను కలిపి 1,63,891 నోటీసులు జారీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే పాలకుర్తిలో అత్యధికంగా, ఘన్‌పూర్‌లో అత్యల్పంగా నోటీసులు జారీ కానున్నాయి.
జనగామ నియోజకవర్గంలో..
జనగామ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 21,939 మంది ఏఎస్‌డీ జాబితాలో ఉన్నట్లు వెల్లడైంది. ధూల్‌మిట్టలో 1,051, నర్మెటలో 1,574, చేర్యాలలో 4,963, మద్దూరులో 1,707, బచ్చన్నపేటలో 5,049, కొమురవెల్లిలో 1,328, జనగామలో 5,049, తరిగొప్పులలో 1,218 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా బచ్చన్నపేట, జనగామలో 5,049 మంది చొప్పున ఉండగా, అత్యల్పంగా ధూల్‌మిట్టలో 1,051 మంది ఉన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా మండలాల వారీగా 31,217 అనామలీస్‌లు నమోదయ్యాయి. 294 పోలింగ్ కేంద్రాల పరిధిలో 37,963 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ఇందులో 37,964 నోటీసులు జనరేట్ కాగా, 737 మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా 37,227 నోటీసులు పంపిణీకి పెండింగ్‌లో ఉన్నాయి. ఘన్‌పూర్‌లో అత్యధికంగా 6,710, రఘునాథపల్లిలో 6,043, ధర్మసాగర్‌లో 5,380 అనామలీస్‌లు నమోదయ్యాయి. మొత్తం 6,746 మ్యాపింగ్ కాని కేసులు గుర్తించారు. విచారణలు, డీఈఓ స్థాయి పరిశీలన, తుది ప్రచురణకు పెండింగ్ కేసులు లేవు. ఇతర కారణాలతో 213 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
పాలకుర్తి నియోజకవర్గంలో
నియోజకవర్గంలో ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా 2,41,462 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేశారు. ఇందులో 19,779 మంది ఏఎస్ డీ, 1,977 మంది డీఎస్‌ఈ కేటగిరీలో ఉన్నాయి. మండలాల వారీగా పాలకుర్తిలో 49,782 ఓటర్లు ఉండగా డిజిటలైజ్ 3,758 ఏఎస్‌డీ 338 డీఎస్‌ఈ, దేవరుప్పులలో 34,973 ఓటర్లు ఉండగా డిజి టలైజ్ 2,615, ఏఎస్‌డీ 250, కొడకండ్లలో 26,011 ఓటర్లు ఉండగా డిజిటలైజ్ 2,829, ఏఎస్‌డీ 249, రాయపర్తిలో 43,914 ఓటర్లు ఉండగా డిజిటలైజ్ 2,165, ఏఎస్‌డీ 300, పెద్దవంగరలో 23,135 ఓటర్లు ఉండగా 2,518, ఏఎస్‌డీ192, తొర్రూరులో 63,647 ఓటర్లు ఉండగా డిజిటలైజ్ 5,894, ఏఎస్‌డీ 648గా నమోదయ్యాయి. మూడు విభాగా ల్లోనూ తొర్రూరు మండలంలో అత్యధిక సంఖ్య నమోదైంది.
వార్డుసభను పరిశీలించిన డీసీసీ అధ్యక్షురాలు
పట్టణంలోని 19వ వార్డులో నిర్వహించిన వార్డు సభను డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓ, బీఎల్‌ఏ–2 లతో మాట్లాడి వార్డు సభ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలోని గైర్హాజరు, శాశ్వతంగా తరలిపోయిన, డూప్లికేట్, మృతి చెందిన ఓట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలని సూచించారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏ–2 లు సమన్వయంతో పని చేస్తూ ఓటరు జాబితాను పరిశీ లించాలని సూచించారు. అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి పరి ష్కరించాలని తెలిపారు.
పాలకుర్తిలో అత్యధికంగా 69,954 మందికి..
ముసాయిదా జాబితాపై గ్రామసభల్లో వెలుగులోకి తప్పులు
ఓటరు జాబితాలో ఫొటో,
పేర్లలో తప్పులు
పకడ్బందీగా చేపట్టినా తప్పని తప్పులు
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ముసాయిదా ఓటరు జాబితాపై నిర్వహించిన గ్రామసభల్లో పలు లోపాలు వెలుగు చూశాయి. ఓటర్ల వయస్సు, ఇంటిపేరు, చిరునామా, తండ్రి పేరు, పిల్లల వయస్సు వంటి వివరాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కొందరికి ఇతరుల ఇంటి నంబర్లపై ఓటు హక్కు నమోదైనట్లు తేలింది. మరోవైపు 30 ఏళ్లుగా ఓటు వేస్తున్నప్పటికీ ప్రస్తుత ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైన ఘటనలు బయటపడ్డాయి. ఒకే ఓటరు ఒక బూత్‌తో పాటు మరో నియోజకవర్గంలోనూ నమోదైనట్లు, మరికొందరు ఒకే నియోజకవర్గంలోని పక్కపక్క బూత్‌లలో రెండుసార్లు నమోదైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో రాజకీయ పార్టీలు వివరాలను సేకరించి, అర్హులైన వారి ఓట్లు గల్లంతుకాకుండా, డూప్లికేట్ ఓట్లు తొలగించేలా సవరణలకు ప్రయత్నాలు చేస్తున్నాయి.


