విద్యుత్‌ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి

Aug 28 2026 1:45 AM | Updated on Aug 28 2026 1:45 AM

జనగామ: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సేవలు అందించడంతో పాటు విద్యుత్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ టి.మధుసూదన్‌ సూచించారు. గురువారం జనగామ సర్కిల్‌ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను వేగంగా గుర్తించి పునరుద్ధరించేందుకు రియల్‌ టైమ్‌ ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా సబ్‌స్టేషన్ల పని తీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పెండింగ్‌ వర్క్‌ ఆర్డర్లను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలన్నారు. సమీక్షలో చీఫ్‌ ఇంజనీర్‌ కె.గౌతమ్‌రెడ్డి, జనగామ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ చెరుకు సంపత్‌రెడ్డి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆపరేషన్‌ డీఈ లక్ష్మీనారాయణ రెడ్డి, డీఈ సారయ్య, డీఈ ఎంఆర్‌టీ విజయ్‌ కుమార్‌, ఎస్‌ఏఓ శంకర్‌, ఏడీఈ లు, ఏఈలు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల కొత్త

యాప్‌ రద్దు చేయాలి

జనగామ రూరల్‌: జిల్లాలో ఐసీడీఎస్‌లో కొత్త రకమైన శిశు మహిళా సమృద్ధి యాప్‌ను రద్దు చేయకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా యాప్‌ విషయంలో యూనియన్‌ నాయకులకు, అధికారులకు మధ్య గంట పాటు చర్చలు జరిగాయి. అనంతరం యూని యన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. కొత్త యాప్‌తో అంగన్‌వాడీలకు పనిభారం పెరుగుతుందన్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కొత్త యాప్‌ తీసుకురావడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు కోమల, ఎల్లమ్మ, రేణుక, స్వరూప, గౌరవ అధ్యక్షుడు సుంచు విజేందర్‌, బైరగోని అంజూమ్‌, కొమ్ము మంగ, అమరావతి, ఎర్రబెల్లి సంతోష, వినోద గంధమల్ల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ కబడ్డీ

న్యాయనిర్ణీత పరీక్షలో ప్రతిభ

జనగామ రూరల్‌: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జూన్‌ 6, 7, 8 తేదీల్లో నిర్వహించిన ఏకేఎఫ్‌ఐ జాతీయ కబడ్డీ న్యాయనిర్ణీత పరీక్షలో జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు చింతకింది సుధాకర్‌, నూకల రాజన్న, జెనిగల రాజు ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయి కబడ్డీ అఫీషియల్స్‌గా అర్హత సాధించారు. ఈసందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలుపుతూ భవిష్యత్‌లో మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో సేవలందించాలని ఆకాంక్షించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు సహకరించిన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాసాని వీరేశం, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్‌ రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ పోగుల సారంగపాణి, అధ్యక్షుడు వై.కుమార్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement