గిరాఖీ ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

గిరాఖీ ఫుల్‌

Aug 28 2026 1:45 AM | Updated on Aug 28 2026 1:45 AM

బస్టాండులో బస్సు కోసం నిరీక్షణ

పట్టణంలో రాఖీలను కొనుగోలు చేస్తున్న మహిళలు, యువతులు

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ పండుగకు జిల్లా సిద్ధమైంది. అన్నదమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు అక్కాచెల్లెళ్లు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో పట్టణం రద్దీగా మారింది. రైల్వేస్టేషన్‌, నెహ్రూ పార్కు, సిద్దిపేటరోడ్డు, స్వర్ణ కళామందిర్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాఖీ దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మరోవైపు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు పెరిగి ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. ఉదయం 10 గంటల నుంచే ఆర్టీసీ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసింది. స్వీట్ల దుకాణాల్లోనూ పండుగ వాతావరణం కనిపిస్తూ వ్యాపారం ఊపందుకుంది.

– జనగామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement