జనగామ: అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలను ప్రస్తావించాలని జిల్లా లైసెన్స్‌డ్ సర్వేయర్లు గురువా రం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కోరారు. భూ భారతి చట్టంలో లేని రీసర్వే పనులను తమకు అప్పగించి, సర్వేకు ఎకరాకు రూ.500 చెల్లించాల్సి ఉండగా రూ.60 చొప్పున ఇద్దరు సర్వేయర్లతో పని చేయించాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాద న్నారు. కనీసం రూ.30వేల గౌరవ వేతనం కల్పించాలని, లేదంటే లైసెన్స్ ని బంధనల ప్రకారం ఎకరాకు రూ.500 చెల్లించి పనులు అప్పగించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పల్లాను కలిసి సమస్యలను వివరించగా, ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని హామీ ఇచ్చినట్లు సర్వేయర్లు చెప్పారు. సర్వేయర్ల జిల్లా అధ్యక్షుడు శివశంకర్, ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసా ద్, సామ్రాట్, పలువురు సర్వేయర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లాకు సర్వేయర్ల వినతి


