పాలకుర్తి టౌన్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రీడలు, విలువలు, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలోని పీఎంశ్రీ పాఠశాలను గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, వంటశాల, పరిసరాల ను పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడి హిందీ, ఇంగ్లిష్, గణితం, సాంఘిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో వారి అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించారు. గణితం, సాంఘిక శాస్త్ర అంశాలను స్వయంగా బోధించారు. ఎంపీడీఓ వేదవతి, ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, సర్పంచ్ కమ్మగాని విజయ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


