జఫర్‌గఢ్ : తెలంగాణ వెనుకబాటుకు బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనే ప్రధాన కారణమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. గురువారం మండలంలోని సాగరం గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయడంతో పాట శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు సర్పంచ్ మమత చైతన్యకుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడింది తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐల య్య, డీఈ బి.సారయ్య, ఏడీఈ రణఽధీర్ రెడ్డి, ఏఈ కరుణాకర్, మాజీ సర్పంచ్‌లు వట్టి ఇన్నారెడ్డి, భిక్షపతి, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి


