జనగామ రూరల్: ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జనగామ యూపీహెచ్‌ఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ జాదవ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణలోని మూడో వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈసందర్భంగా కౌన్సిల ర్ జ్యోతి మాట్లాడుతూ..మహిళలకు, గర్భిణులకు ప్రత్యేక చికిత్స పరీక్షలు నిర్వహిస్తున్నారని, అలాగే చిన్నపిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కసాబ్, అనిల్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, మచ్చ ప్రవీణ్, రవీందర్, గుండు శశిరేఖ దాసరి సరిత, కవిత తదితరులు పాల్గొన్నారు.


