పూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

జనగామ: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పూలేకు పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు సమర్పించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్‌ఎల్‌ నరసింహరావు, ఏబీసీడీఓ రవీందర్‌, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిద్దయ్యగౌడ్‌, హరీశ్‌, వీరస్వామి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, యాదవ సంఘం జనరల్‌ సెక్రటరీ మేకల సమ్మ య్య, ఉపేందర్‌ యాదవ్‌, సేవాదళ్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ బిర్రు సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ సంఘం జనరల్‌ సెక్రటరీ కృష్ణమూర్తి, కురుమ సంఘం సెక్రటరీ మల్లేష్‌, రెడ్‌క్రాస్‌ అధ్యక్షుడు కన్నా పరశురాములు, విశ్వకర్మ సంఘం జిల్లా ప్రెసిడెంట్‌ రామేశ్వరాచారి పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఏసీ, డీసీపీ

మరిన్ని ఫొటోలు 9లో

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement