జనగామ: మండలంలోని ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విషయంలో సర్పంచ్, ఉ ప సర్పంచ్‌లు పూర్తి సహకారం అందించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. శనివారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్‌న్, సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి మండలంలోని సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో సమావేశం ని ర్వహించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఊరికి భద్రతగా నిలుస్తాయన్నారు. నేరా ల నియంత్రణకు ఉపయోగపడుతాయన్నారు. త్వ రలోనే గ్రామాల్లో సీసీటీవీ వ్యవస్థను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చోరీల నియంత్రణ
జఫర్‌గఢ్ : ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలను నియంత్రించవచ్చని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌లతో సీసీ కెమెరాల ఏర్పాటుపై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఎస్సై రామారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
సర్పంచ్,ఉప సర్పంచ్‌లతో
డీసీపీ సమావేశం


