సంక్షేమ పథకాలతో రైతేరాజు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలతో రైతేరాజు

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

స్టేషన్‌ ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రఘునాథపల్లి: తెలంగాణలో రైతును రాజుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రెండేళ్ల కాలంలో దేవాదుల కాలువలకు మరమ్మతులు, పూడికతీత తీయించి ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు రావడంతో నియోజకవర్గంలో పంటల దిగుబడి, పంట నాణ్యత పెరిగిందన్నారు. శుక్రవారం మండలంలోని కంచనపల్లిలో 25 లక్షల సీసీ రోడ్డు, నిర్మాణాలు పూర్తయిన నాలుగు ఇందిరమ్మ ఇళ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మండల కేంద్రంలోని రైతు వేదికలో 37 మందికి రూ.12 లక్షల 52 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మారుజోడు రాంబాబు, డీసీఓ కోదండరాములు, తహసీల్దార్‌ రాజేష్‌రెడ్డి, సొసైటీ ఇన్‌చార్జ్‌ వేణుగోపాల్‌, సీఈఓ ప్రశాంత్‌, సర్పంచ్‌ గొంగళ్ల అబ్రహం, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, నాయకులు లోనే రవి, రాపోలు రామ్మూర్తి, పర్ష సిద్దేష్‌, జయరాములు, విజయమేరి, హరినాథ్‌, రాజు, కోళ్ల రవి, రవి, రంగోజు ఈశ్వరయ్య, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సెంటినరీ బాప్టిస్టు చర్చి వార్షికోత్సవంలో ..

కంచనపల్లి సెంటినరీ బాప్టిస్టు చర్చి వార్షికోత్సంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కేఎం జాన్‌, జయమణి, దేవదానం, దైద ప్రభుదాసు, గడ్డం సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement