లింగాలఘణపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తగిన మౌలిక వసతులు కల్పించాలని, రైతుల మేలు కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని కుందారంలో మొక్కజొన్న, నెల్లుట్లలో ధాన్యం, పటేల్‌గూడెంలో వాటర్‌ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. మొక్కజొన్న రైతుల దళారుల చేతుల్లో మోసపోతున్నారని గుర్తించి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు. పటేల్‌గూడెంలో ఎస్‌డీఎఫ్ నిధులు రూ.2 లక్షలతో చేపట్టిన వాటర్‌ప్లాంట్, నెల్లుట్లలో రూ.16లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును ప్రారంభించారు. రూ.5లక్షల 8వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు కూకట్ల రాజు, పొన్నాల బుచ్చయ్య, నర్సింగ రామకృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివకుమార్, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, నాయకులు నాగరాజు, బాలరాజు, ప్రవీణ్, తహసీల్దార్ అండాలు, ఏఓ మమత, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి


