అంగన్‌వాడీలతోనే ఆరోగ్యవంత సమాజం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలతోనే ఆరోగ్యవంత సమాజం

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర కీలకమని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని అంగన్‌వాడీ టీచర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్ణణ కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ వ్యవస్థను ఆధునీకరించేదిశగా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..నియోజకవర్గంలో ఎలాంటి సదుపాయం లేని అంగన్‌వాడీ కేంద్రాలకు నెలరోజుల్లో సొంత భవనాలు మంజూరు చేయించి ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేయిస్తానన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నూకల ఐలయ్య, ఘన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ నీల రాజమ్మగట్టయ్య, జనగామ, హన్మకొండ జిల్లాల డీడబ్ల్యూఓలు కోదండరాం, విశ్వజ, తహసీల్దార్‌ స్వప్న, ఎంపీడీఓ విజయశ్రీ, ఐసీడీఎస్‌ ఘన్‌పూర్‌ సీడీపీఓ సరస్వతి, సూపర్‌వైజర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఎంపీ కడియం కావ్య

అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement