జనగామ రూరల్: ఈనెల 13న సాయంత్రం జిల్లా కేంద్రంలో నిర్వహించే అంబేడ్కర్ జ్ఞానయాత్రకు అంబేద్కర్ వాదులు, అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక విజయ ఫంక్షన్ హాల్‌లో బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..11న మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని, 12న పట్టణంలో భారీ బైక్ ర్యాలీ, 13న సాయంత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీఅంబేడ్కర్ జ్ఞానయాత్రశ్రీ, 14న అధికారికంగా అంబేడ్కర్ జయంతి ఉత్సవ సభ ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉడుగుల సాగర్, జేరిపోతుల పరశురాములు, రాగళ్ల ఉపేందర్, పార్నంది వెంకటస్వామి, కౌన్సిలర్ సువార్త, మల్లిగారి రాజు, కన్నారపు ఉపేందర్, కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


