జనగామ: జిల్లాకేంద్రంలోని వైష్ణవి బ్యాంకెట్ హాల్ మంగళవారం చిరునవ్వులు, ఆనందోత్సవాలు, పా త జ్ఞాపకాలతో కళకళలాడింది. 1971–72 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించుకుని, దాదాపు 55 ఏళ్ల అనంతరం ఒకే వేదికపై కలుసుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. చా లాకాలం తర్వాత ఇలా అందరూ ఒకచోట కలవడ ంతో పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇ లాంటి సమ్మేళనాలు ప్రతీ సంవత్సరం నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఆత్మీయ సమ్మేళనం వారికి పాత జ్ఞాపకాలను మాత్రమే కాదు.. తరతరా ల పాటు నిలిచే అనుబంధాన్ని పునరుద్ధరించింది.
55 సంవత్సరాల అనంతరం
కలుసుకున్న పూర్వ విద్యార్థులు


