పరుగు పోటీలతో ఆరోగ్య చైతన్యం | - | Sakshi
Sakshi News home page

పరుగు పోటీలతో ఆరోగ్య చైతన్యం

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట ఆవరణలో తెలంగాణ రన్నర్స్‌ ఆధ్వర్యంలో ప్రోమో రన్‌ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ ప్రోమో రన్‌ను ప్రారంభించారు. తెలంగాణ రన్నర్స్‌ సభ్యులు హ రీష్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్‌, అవంతి కన్స్‌స్ట్రక్షన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌పీఆర్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ కీర్తి వీరేందర్‌, తాజా టిపిన్‌ ఎండీ తమ్మిశెట్టి సతీష్‌, జగన్‌, రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రన్నర్స్‌ పాల్గొన్నారు. బతుకమ్మకుంట నుంచి నెహ్రూపార్క్‌, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, వడ్లకొండ జంక్షన్‌ మార్గంలో 2కే, 5కే, 10కే మూడు కేటగిరీలలో రన్నర్లు పరుగు పందెం పూర్తి చేసి తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ మాట్లాడుతూ.. ఇలాంటి రన్నింగ్‌ ఈవెంట్లు యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి, సీఐ సత్యనారాయణ, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు, కౌన్సిలర్‌ బాల భరద్వాజ్‌, పాముకుంట్ల ప్రసాద్‌, ఎస్‌ఐ భరత్‌, నాయకులు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, నారోజు రామేశ్వరచారి, మంగ ళంపల్లి రాజు, పిట్టల సురేష్‌, బుర్రా రమేష్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

డీసీపీ రాజమహేంద్ర నాయక్‌

ఉత్సాహంగా తెలంగాణ

రన్నర్స్‌ ప్రోమో రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement