● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే అది ప్రభుత్వ ఆస్తి అని, ఇలా చేయడం నేరంగా పరిగణించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక వారి నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.


