అజ్మీరా తండాలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు
జనగామ: మండలంలోని ఎర్రగొల్లపహాడ్ అజ్మీరా తండాలో ఎన్పీడీసీఎల్ అధికారులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ బిగించి విద్యుత్ పునరుద్ధరించారు. అజ్మీరాతండాలో తన పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి 15 రోజులు గడిచిపోతున్నా పట్టించుకోవడం లేదని గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన బాధిత రైతు రవి.. కలెక్టర్ కాళ్లుమొక్కిన సంగతి తెలిసిందే. రైతు దీనగాఽథను ‘ట్రాన్స్ ఫార్మర్ ఇప్పించండి..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్పీడీసీఎల్ అధికారులు తండాలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో సమస్యకు పరిష్కారం లభించింది.
అజ్మీరా తండాలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు


