బీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి లేదు
జనగామ: నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి కాంగ్రెస్‌కు లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన సర్పంచ్‌లు, పాలక మండళ్లకు సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. 8 మండలాల్లో బీఆర్‌ఎస్ దూకుడుతో కాంగ్రెస్ చతికిలబడి పోయిందన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సొంతూరు నర్సాయపల్లిలో పోలీసులను అడ్డం పెట్టుకున్నా బీఆర్‌ఎస్ అభ్యర్థి 400 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, వారు తలదించుకోక తప్పలేదన్నారు. అలాగే ఆయన అత్తగారి ఊరు గంగాపురంలో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎ న్నికల్లో బీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థులే గెలుపొందారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటి వెంట సైతం జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకే ప్రజాభిమానముందని చెప్పిన విషయం గు ర్తుంచుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కో సం తాను నిధులు తీసుకు వస్తే, కొమ్మూరి వాటిని రద్దు చేయించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 8 జెడ్పీటీసీలు, రెండు ము న్సిపాలిటీలు బీఆర్‌ఎస్ గెలుచుకోబోతుందన్నారు. గులాబీ కార్యకర్తలు అమ్ముడుపోయే వారు కాదని, మంత్రులను కలిసి అభివృద్ధి కోసం నిధులు తీసుకు రాబోతున్నానని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, ఇర్రి రమణారెడ్డి, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, బాల్‌నర్సయ్య, బద్దిపడగ క్రిష్ణారెడ్డి, కాయితాపురం రామ్మోహన్‌రెడ్డి, భైరగోపి యాదగిరిగౌడ్, మసిఉర్ రెహామన్ తదితరులు ఉన్నారు.
8 జెడ్పీటీసీలు, రెండు మున్సిపల్
సైతం మావే
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


