పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం
జనగామ: దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఏకై క పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ అబ్జర్వర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వేడుకల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి బైకని లింగం యాదవ్‌తో కలిసి వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 141 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణం అన్నారు.
అబ్జర్వర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి


