మరింత వేగంగా కేసుల పరిష్కారం
● వార్షిక తనిఖీలో
ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్
జనగామ: కేసుల పరిష్కారంలో మరింత వేగం పెరగాలని ఏఏస్పీ పండేరి చేతన్ నితిన్ (ఐపీఎస్) అన్నారు. వార్షిక తనిఖీ–2025 ల్లో భాగంగా శుక్రవారం ఏఎస్పీ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన కిట్ మెయింటెనెన్స్, స్వచ్ఛత, క్రమశిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యాలు వంటి అంశాలను వ్యక్తిగతంగా తనిఖీ చేశారు. అదే విధంగా స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, కేసు డైరీలు, సీడీ ఫైళ్లు, వివిధ రిజిష్టర్లు, అధికారిక దస్తావేజులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే కేసుల నమోదు ప్రక్రియ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నవీకరణ విధానం, స్టేషన్ పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫిర్యాదుదారులకు సమయానుసారంగా న్యాయం అందించాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, శాంతి భద్రతల.. అంశాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్‌స్టేషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ప్రొఫెషనల్‌గా, బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు.


