ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందంజ
● జిల్లాలో 5,026 ఇళ్లలో
పనుల కొనసాగింపు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: నిరుపేదలకు నిలువ నీడ కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడంతో పాటు, మంజూరైన ప్రతీ ఇల్లు నిర్మాణంలో వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. త్వరగా గ్రౌండింగ్ చేస్తూ రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు అధికారుల కృషి, సమన్వయం ఎంతో ఉందన్నారు. జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ జరగని వాటికి సంబంధించి పలుమార్లు రివ్యూలు చేయడంతో పాటు లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా కృషి చేయడం వల్ల రాష్ట్రస్థాయిలో గ్రౌండింగ్‌లో జిల్లా ప్రథమ స్థానంలో నిలబడిందన్నారు. జిల్లాల్లో..రెండు విడతల్లో..5,834 ఇల్లు మంజూరు కాగా ఇప్పటివరకు 5,206 ఇళ్లు నిర్మాణ దశ లో ఉండగా.. 33 ఇళ్లు పూర్తయ్యాయన్నారు.


