ప్రజల ఆర్థికాభివృద్ధికే బ్యాంకుసేవలు
దేవరుప్పుల: ప్రజల ఆర్థికాభివృద్ధి కోసమే బ్యాంకు సేవలు దోహదపడుతాయని ఆర్‌బీఐ ఎజీఎం గోమతి సూచించారు. మంగళవారం మండలంలోని చిన్నమడూరులో కాకతీయ గ్రామీణ బ్యాంకు సింగరాజుపల్లి మేనేజర్ కత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఆన్‌లైన్ సేవలు, నగదు చెల్లింపు ప్రక్రియలు, సైబర్ మోసాలపై జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దారిద్య్రరేఖ దిగువనున్న ప్రజలకు బ్యాంకు రుణాలు ఇస్తూ ఉత్పత్తి రంగాల్లో పురోగతి సాధించినప్పుడే ఆర్థిక సాధికారత సాధ్యమన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మైదం జోగేశ్వర్ చిన్నమడూరులో పూర్వపు ఆర్థిక లావాదేవీలు కొనసాగేలా బ్యాంకు ఏర్పాటు ఆవశ్యకతతో కూడిన వినతి పత్రం అందించడంతో సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముసిగుంపుల వెంకటేష్, మేడ సోమనర్సయ్య, వార్డు సభ్యులు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ పోస్టులకు నేడు ఇంటర్వ్యూలు
జనగామ: జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీచేయనున్న పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులను ఈనెల 24న(బుధవారం) ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌లోని రెండో అంతస్థు వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రుల ప్రధాన పర్యవేక్షణాధికారి కార్యాలయంలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. సీఏఎస్ స్పెషలిస్టు విభాగంలో 8 పోస్టులు ఉన్నాయన్నారు. అర్హత ఏదైనా పీజీలో స్పెషాలిటీ ఉండాలన్నారు. ఎంఎస్, ఓబీజీ, డీజీవో,ఎండి.జనరల్ మెడిసిన్, ఎండీ డీఎన్‌బీ, పీడియాట్రిక్స్ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇంటర్వ్యూకు వచ్చే క్రమంలో అర్హత, అనుభవం గల అభ్యర్థులు అన్ని విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని చెప్పారు.
ఆలయానికి
రూ.1,01116 విరాళం
బచ్చన్నపేట: మండలంలోని రామచంద్రాపురం గ్రామంలోని శ్రీ శివసీతారామాజనేయ స్వామి దేవాలయం పునఃనిర్మాణంలో భాగంగా నిడిగొండ సాయమ్మ, నర్సింహులు దంపతుల కుమారుడు నిడిగొండ శ్రీకాంత్ రూ.1,01116లను విరాళంగా మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో బక్కెర సిద్ధయ్య, ఆముదాల మల్లారెడ్డి, నాచగోని సిద్ధేశ్వర్, సుంకే కనకయ్య, నల్ల రవీందర్‌రెడ్డి, నర్మెట చంద్రమౌళి, నాగరాజు, యాదగిరి, రాములు, కనకయ్య, రమేశ్, నర్సయ్య, బింగి రవి, చిమ్మ మహేశ్, కనకయ్య, మల్లయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
చిల్పూరు: పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న జీడి ప్రీతి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎల్లంబట్ల విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు దేవ్‌సింగ్ తెలి పారు. వరంగల్‌లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా జూనియర్ ఖోఖో పోటీల్లో ప్రీతీ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు. ఈనెల 30, 31, జనవరి 1వ తేదీన వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు.


