ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
జనగామ రూరల్: రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దృష్ట్యా జనవరిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
నేడు ‘మీ డబ్బు.. మీ హక్కు’ ప్రత్యేక శిబిరం
ప్రజలు క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులను తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నామని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఆస్తులు యజమానులకు చేరేలా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి


