జీపీఓలతోనే గ్రామపాలన బలోపేతం
● ఉమ్మడి జిల్లా జీపీవోల కన్వీనర్
పెండెల శ్రీనివాస్
జనగామ: గ్రామ పరిపాలన ఆఫీసర్స్ నేతృత్వంలో గ్రామాలు మరింత బలోపేతం అవుతాయని ఉమ్మడి వరంగల్ జిల్లా జీపీఓల కన్వీనర్ పెండెల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్‌లో ఆదివారం పెండెల శ్రీనివాస్ అధ్యక్షతన డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ గ్రామ రెవెన్యూ సహాయకుల(జీపీఓ)రాష్ట్ర నాయకులు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
జిల్లా జీపీఓల నూతన కమిటీ
జనగామ జిల్లా గ్రామ పాలన ఆఫీసర్స్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నామాల పరుశరాములు, జిల్లా కార్యదర్శిగా కలకుంట్ల దిలీప్, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కాగా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా తుంగ రాములు, ఉపాధ్యక్షులుగా కట్ల సుభాష్, బండ భిక్షపతి, ఓర్స్ తిరుమల, సహాయ కార్యదర్శులుగా కొమురయ్య, చంద్రకళ, కోశాధికారిగా లూనవత్ చాజు, ప్రచార కార్యదర్శిగా సత్యనారాయణ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జనగామ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా గుజ్జు రవీందర్, పండుగ యాకన్న, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా జోగు యాకయ్య, రాజయ్యను ఎన్నుకున్నారు.


